జన్నారం మండలంలోని పలు గ్రామాలలో గురు పౌర్ణమి పండుగను భక్తులు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా శుక్రవారం జన్నారంలోని శ్రీ సాయిబాబా, శ్రీ వెంకటేశ్వర స్వామి, తదితర దేవాలయాల్లో స్వామి వార్లకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోటిగూడా గ్రామంలోని గీతా మందిర్లో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.