ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులకు దూరంగా ఉండవచ్చని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ సూచించారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఇళ్ల పరిసరాలలో నీటి గుంతలు ఉంటే దోమల బెడద ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వ్యాధుల నివారణకు సహకరించాలని ఆయన సూచించారు.