జన్నారంలోని సుందరయ్య నగర్ లో రాత్రివేళ ప్రజలు ఇబ్బంది పడకుండా వీధి దీపాలను ఏర్పాటు చేశామని పంచాయతీ ఈవో రాహుల్ తెలిపారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు మంగళవారం ఆ కాలనీలో ఉన్న విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలను బిగింప చేశారు. సుందరయ్య కాలనీ, జువ్విగూడా శివారుగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.