నిరుపేదల పక్షాన నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని యూత్ కాంగ్రెస్ జన్నారం మండల అధ్యక్షుడు పాదం రాకేష్ అన్నారు. బుధవారం జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో నిరుపేదకు వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 60 వేల సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. నిరుపేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.