కవ్వాల్ అభయారణ్యంలో భారీ వాహనాలను అనుమతించాలని కోరుతూ జన్నారం ఎఫ్డిఓ రామ్మోహన్ కు వినతి పత్రం సమర్పించనున్నామని జన్నారం మండల సేవా సమితి నాయకులు భూమాచారి, బద్రీ నాయక్ తెలిపారు. గురువారం జన్నారంలో వారు మాట్లాడుతూ భారీ వాహనాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక ఎఫ్డిఓకు వినతి పత్రం సమర్పించనున్నామని, ప్రజలు భారీగా తరలి రావాలని వారు కోరారు.