బ్యాంకు సేవలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జన్నారం మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రాజశేఖర్, దండేపల్లి మండలం సిఎఫ్ఎల్ కౌన్సిలర్ వేల్పుల రవీందర్ కోరారు. గురువారం జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో జన సురక్ష ప్రోగ్రామ్, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం దండేపల్లి సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకులోని ఖాతాలు, రుణ సౌకర్యాల గురించి ప్రజలకు వివరించారు.