జన్నారం: బైకు చోరీ కేసులో ఒకరికి ఏడాది జైలు

బైకు దొంగతనం కేసులో మూటపెల్లి పవన్ కు ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తూ లక్షేట్టిపేట కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ అసదుల్లా షరీఫ్ తీర్పునిచ్చినట్లు ఎస్సై రాజ వర్ధన్ గురువారం తెలిపారు. 2024 జులై 30న జన్నారం మండల కేంద్రంలోని ఉడిపి హోటల్ ముందు మహమ్మద్ కు చెందిన పల్సర్ బైకు అపహరణకు గురైంది. పోలీసుల విచారణలో నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా నేరం రుజువైందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్