ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత అందరిదని జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ ప్రత్యేకాధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలోని ప్రకృతి వనంలో ఈజిఎస్ కూలీలతో కలిసి మొక్కలు నాటారు. గ్రామాన్ని పచ్చదనంగా మార్చేందుకు మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు ఉన్నారు.