జన్నారం మండలంలోని సింగరాయిపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మణికంఠ రైస్ మిల్, గోదాములో ధాన్యం దిగుమతి ప్రక్రియను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని సక్రమంగా నిల్వ చేయడంతో పాటు రైతులకు ఇబ్బందులు కలగకుండా రవాణా, దిగుమతి ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.