రైతు నేస్తం కార్యక్రమానికి రైతులు రావాలని జన్నారం మండలంలోని పోన్కల్ క్లస్టర్ ఏఈఓ త్రిసంధ్య కోరారు. సోమవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వానాకాలం పంటలు, కలుపు యాజమాన్యంపై మంగళవారం ఉదయం 10 గంటలకు పోన్కల్ రైతు వేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫిరెన్స్ ఉంటుందన్నారు. ఇందులో పంటల సస్యరక్షణ, తదితర అంశాలను శాస్త్రవేత్తలు వివరిస్తారని, రైతులు తప్పకుండా రావాలన్నారు.