జన్నారం: 'వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావాలి'

అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావాలని జన్నారం మండలంలోని ఇందన్‌పల్లి అటవీ రేంజ్ నూతన ఎఫ్ఆర్ఓ శ్రీధర్ చారి సూచించారు. సోమవారం ఇందన్‌పల్లిలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరాములు గంగాధర్, గౌరవ అధ్యక్షులు గురవయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్