జన్నారం: 'ఐదు దరఖాస్తులను స్వీకరించాం'

ప్రజావాణిలో ఐదు దరఖాస్తులను స్వీకరించామని స్థానిక తహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఎంపీడీవో కుమార్ షరీఫ్ తెలిపారు. సోమవారం జన్నారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుండి వారి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణిని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్