కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా వచ్చింది. శుక్రవారం DLC రాజేశ్వరి సమక్షంలో అర్హత కలిగిన 5 యూనియన్లతో చర్చలు జరిపారు. ఈ నెల 18న నిర్దిష్టమైన ఎన్నికల తేదీ, గేట్ మీటింగ్ల తేదీలను నిర్ణయిస్తామని చెప్పారు. సమావేశంలో 5 యూనియన్లకు గుర్తులను కేటాయించారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, ఎన్నికల నియామావళి అందరూ పాటించాలని సూచించారు.