లక్షేటిపేట: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

లక్షేటిపేట మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లి గ్రామానికి చెందిన మేదరి రాజన్న (55) దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్ తో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. మందులు వాడినా తగ్గకపోవడంతో మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్