లక్షేటిపేట మండలంలోని చందారం గ్రామంలో కత్తెర శాల మల్లికార్జున స్వామికి అగ్నిగుండాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు ప్రతి సంవత్సరం ఇదే మాసంలో మొదటి అమావాస్య నుండి చివరి అమావాస్య వరకు షష్టి నియమ నిబంధనలతో ఉంటామని, మద్యం, మాంసం తినకుండా షష్టిని పూర్తి చేస్తామని తెలిపారు. నైవేద్యాలు, బోనాలు సమర్పించి, పట్నాలు వేసి అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు.