లక్షెట్టిపేటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఉత్కూర్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించి, మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు మాట్లాడుతూ, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2001లో పార్టీని స్థాపించి ప్రత్యేక తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలను ఆదుకుందన్నారు.