లక్షేట్టిపేట మండలంలోని ఇటిక్యాల గ్రామం గోదావరి తీరాన వెలసిన సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, తులాభారం బెల్లం (బంగారం) సమర్పిస్తున్నారు. జాతర కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీటి సదుపాయం, నీడ కోసం టెంట్లు, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.