లక్షెట్టిపేట పట్టణంలోని అంగడి బజార్ హనుమాన్ మందిర ఆలయంలో బుధవారం కూచిపూడి నృత్య విద్యార్థినుల గజ్జె పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వార్షికోత్సవ సంబరాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో వేద పండితులచే మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.