మాఘ పౌర్ణమి సందర్భంగా లక్షేటిపేట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహ స్వామి ఆలయం వద్ద 10వ గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గిరి ప్రదర్శన అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత, హనుమాన్ చాలీసా పారాయణం, శివ శంకర భక్తమండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు జరిగాయి. పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.