లక్షేటిపేట బాలికల ఉన్నత పాఠశాలలో అవోపా ఆధ్వర్యంలో సంక్రాంతి రంగవల్లి ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. అవొపా రాష్ట్ర నాయకులు గుండా ప్రభాకర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వొజ్జల రాజమౌళిలు ఈ పోటీలను ప్రారంభించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆర్యవైశ్య మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ కళాత్మకతను ప్రదర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు.