లక్షెట్టిపేట: కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలి

మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి లక్షెట్టిపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాము, ఇటిక్యాలలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతోపాటు గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్