లక్షేట్టిపేట: వైభవంగా నరసింహస్వామి జయంతి ఉత్సవాలు

లక్షేట్టిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల గ్రామ శ్రీ ప్రసన్న లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో నరసింహ స్వామి జయంతి సందర్భంగా సోమవారం వైభవంగా కార్యక్రమాలు జరిగాయి. సుప్రభాత సేవ, పంచామృత విశేష అభిషేకాలు, శ్రీ సుదర్శన నృసింహ హోమం, పూర్ణాహుతి, స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం మహా నివేదన చేసి, భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు.

సంబంధిత పోస్ట్