లక్షేట్టిపేట మండలంలోని ఇటిక్యాల గ్రామం గోదావరి నది తీరాన ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు ఈరోజు సాయంత్రం సమ్మక్క దేవతను మేడారం పోయ పూజారులు భాజా–భజన్తిరుల మధ్య ఘనంగా తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు గద్దెలపై ఆశీస్సులు ప్రసాదిస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.