లక్షెట్టిపేట: 'పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని లక్షెట్టిపేట మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెల్లా నాగభూషణం అన్నారు. శుక్రవారం లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్