ఆదివారం లక్షేటిపేటలో జరిగే మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశించారు. మంత్రుల పర్యటనను పురస్కరించుకొని శనివారం కలెక్టర్ కుమార్ దీపక్, ఇతర అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. డిప్యూటీ సీఎం రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి నరసింహారావు హాజరై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు.