జీవితంపై విరక్తి చెందిన వడ్డేపల్లి రవీందర్ (40) అనే మేస్త్రి హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రైవేట్ బ్యాంకులో రుణం తీసుకొని ఇల్లు కట్టుకున్న రవీందర్, కిస్తీలు సకాలంలో చెల్లించలేక మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లోని బాల్కనీలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వెల్లడించారు.