కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అవుతున్న జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని పేర్కొన్నారు.