తప్పుడు లెక్కలతో వరి ధాన్యాన్ని చూపించి సివిల్ సప్లై నిధులు రూ. 1. 39 కోట్లు కాజేసిన కేసులో మూడవ నిందితుడు సాయికుమార్ ను అతని ఇంటి వద్ద శనివారం అరెస్ట్ చేసినట్టు జైపూర్ ఎస్సై శ్రీధర్ తెలిపారు. ఈ కేసులో మిగతా ముద్దాయిలు 12 మంది పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడం కోసం ఎస్సై ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.