మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళ డిగ్రీ కళాశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికి విద్యార్థినుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అనూష తెలిపారు. 2025 లో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు 10, ఇంటర్ మెమొలు, కుల, తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఫోటోలతో ఈనెల 23 లోగా నేరుగా కళాశాలలో అందజేయాలని సూచించారు.