మంచిర్యాల: అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

మంచిర్యాలలోని ఏసీసీ 3 అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లి పాలపై ఏఎన్ఎం నాగలక్ష్మి అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలోనే తల్లిపాలు పట్టించాలని, నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమని తెలిపారు. తల్లిపాలు వల్ల శిశువుకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఎన్. పద్మ, హెల్పర్ లత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్