మంచిర్యాల ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లకు ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. శుక్రవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో ఇది ఒకటని జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు.