మంచిర్యాల: ఐటీ కంపెనీ నెలకొల్పడం పై హర్షం

మంచిర్యాలలో నెక్స్ట్ అల్ట్రా ఐటీ కంపెనీని ఆర్డిఓ శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కంపెనీ యువతలో నైపుణ్యాలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, పలు సాఫ్ట్వేర్ నైపుణ్యాలను పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. నేటి యువత అధునాతన టెక్నాలజీ, ఐటీపై అవగాహన కలిగి ఉండడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవం మంచిర్యాల అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్