జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు మాట్లాడుతూ, చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ ద్వారా తల్లిదండ్రులుగా పూర్తి ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో "దత్తత కార్యక్రమాలు & ఫోస్టర్ కేర్ అవగాహన" జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, చట్టబద్ధత ప్రక్రియను సులభతరం చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ ను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత కూడా పాల్గొన్నారు.