లక్షెట్టిపేట మండలంలోని ముత్తెబుచ్చయ్యపల్లి వద్ద హార్వెస్టర్ ఢీకొన్న ప్రమాదంలో దుర్గం మల్లేష్ అనే వ్యక్తి మృతి చెందగా, మధుకర్ అనే వ్యక్తి గాయపడ్డాడు. వీరిద్దరూ దండేపల్లి మండలం కొర్విచెల్మకు ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. హార్వెస్టర్ రివర్స్ తీసుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.