మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కు చెందిన కొత్తచిందం తిరుమల (35) కనిపించడం లేదని ఎస్ఐ తిరుపతి సోమవారం తెలిపారు. తిరుమల కొంత కాలం క్రితం భర్తకు విడాకులు ఇచ్చి తల్లితో కలిసి ఉంటుంది. ఈనెల 3న మధ్యాహ్నం ఇంటిలో నుంచి వెళ్లిపోయి రాత్రి మంచిర్యాలలోని స్నేహితురాలు వద్ద ఉన్నానని బుధవారం 4న ఇంటికి వస్తానని తల్లికి సమాచారం ఇచ్చింది. 4న ఇంటికి రాకపోగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయిందన్నారు.