మంచిర్యాల జిల్లాలో నీట్ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంచిర్యాల కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్, పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.