సింగరేణిలో సుదీర్ఘకాలం తర్వాత సమ్మె సైరన్ మోగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ లోని మందమర్రి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ లోని బొగ్గు బావులపై కార్మికులు బుధవారం స్వచ్ఛందంగా విధులను బహిష్కరించారు. ఒక్కరోజు సమ్మె వల్ల సింగరేణికి దాదాపు రూ.76 కోట్ల నష్టం వాటిల్లనుంది, ఉద్యోగులు వేతనాల రూపంలో రూ.13 కోట్ల 7 లక్షలు నష్టపోతారని యజమాన్యం ప్రకటించింది.