వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు నగదు చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంచిర్యాల కలెక్టరేట్లో పౌరసరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.