మంచిర్యాల కలెక్టరేట్లో బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఎల్లోప్ మెంట్ కేసెస్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాములు మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, వారి సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కౌమార దశలో పిల్లల్లో ఏర్పడే మార్పులపై అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.