మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లాలో వ్యవసాయ సాగులో అధిక పంట దిగుబడి సాధించేందుకు రైతులు మెలకువలు పాటించాలని సూచించారు. మంచిర్యాల కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో సన్నరకం వడ్ల సాగుపై రైతులు దృష్టి సారించేలా అధికారులు ప్రోత్సహించాలని, పంట సాగులో అవసరమైన మెలకువలు, సూచనలు అందించి, నాణ్యమైన పంట దిగుబడి సాధించేలా కృషి చేయాలని కోరారు.