హాజీపూర్ మండలం దొనబండ–పెద్దంపేట వంతెన వద్ద నాసిరకం మట్టి కారణంగా టీజీఎస్‌ఆర్టీసీ బస్సు బురదలో చిక్కుకుంది. బస్సులో 60 మంది విద్యార్థులు ఉండగా, డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొని రహదారికి వెంటనే మరమ్మతులు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో ప్రయాణికులు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.