మంచిర్యాల: చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు శిక్ష

మంచిర్యాల జూనియర్ సివిల్ కోర్టు, చెక్ బౌన్స్ కేసులో శ్రీరాంపూర్ కు చెందిన గుమాస్తా కాంతారావుకు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. గౌతమి నగర్ కు చెందిన చిట్టెంపల్లి వేణుమాధవ్ వద్ద రూ. 7.5 లక్షలు అప్పుగా తీసుకుని, చెక్కులు, షూరిటీగా పెట్టిన కాంతారావు, గడువు ముగిసినా అప్పు చెల్లించలేదు. దీంతో చెక్కులు బౌన్స్ అయ్యాయి. న్యాయం కోసం వేణుమాధవ్ 2017లో కోర్టును ఆశ్రయించగా, విచారణ అనంతరం కాంతారావు నేరం రుజువు కావడంతో జడ్జి నిరోషా ఈ తీర్పునిచ్చారు. తీసుకున్న అప్పును పూర్తిగా చెల్లించాలని కూడా ఆదేశించారు.

సంబంధిత పోస్ట్