మంచిర్యాల: బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం కలెక్టరేట్ లో అధికారులతో సమావేశమై బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి, బలోపేతం చేయాలని సూచించారు. అనాధ పిల్లలను గుర్తించి, వారిని తగిన వసతి గృహాలలో చేర్పించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్