మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామన్ పల్లి గ్రామంలోని ఎస్టీ కాలనీకి వెళ్లే రహదారి మొత్తం బురదమయం అయింది. శుక్రవారం గ్రామస్తులు సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కార్లలో కాకుండా కాలినడకన వస్తే మా సమస్యలు తెలుస్తాయని గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.