మంచిర్యాల జిఆర్పి పోలీసులు బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈనెల 25న రైలులో దొంగతనం చేసిన రేహనా, రాఘవేంద్ర, వెంకటేశ్వర్లు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మైనర్లు అయిన వారు నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి బంగారు చెవి కమ్మలు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.