మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో ఆదివారం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఆ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఈ ఆసుపత్రి ద్వారా లక్షెట్టిపేట ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. స్థానిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు.