మంచిర్యాల: మహిళ మిస్సింగ్ కేసు నమోదు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడకు చెందిన అంకిత (40) అదృశ్యమైనట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈనెల 7న ఉదయం కూరగాయలు తీసుకువచ్చేందుకు మార్కెట్ కు వెళ్ళింది. సాయంత్రం అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించారు. అయినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో భర్త తారాచంది శర్మ మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్