శ్రీరాంపూర్ లో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే సీనియర్ ఆటో కార్మికులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు ప్రభుత్వం ప్రతి నెల రూ. 12 వేలు జీవనభృతి చెల్లించి ఆదుకోవాలని కోరారు.