విద్యార్థినులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ లో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన గదులను ఆయన పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సదరు సిబ్బందికి ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని విద్యార్థులకు సూచించారు.