లక్షేటిపేటలో సామూహిక వరలక్ష్మీ వ్రతం

లక్షేటిపేట పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం, కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక మండపంలో అష్టలక్ష్మీ లను పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మహిళలు లలిత పారాయణం చేసిన అనంతరం వేద పండితులచే వరలక్ష్మీ వ్రతం, కుంకుమ పూజలను నిర్వహించారు. కార్యక్రమానంతరం ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్